సన్‌రైజర్స్‌కు సవాల్.. వైభవ్ సూర్యవంశీని ఆపగలరా?

ఐపీఎల్ 2026లో అప్రతిహతంగా సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. నేడు హైదరాబాద్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రియాన్ పరాగ్ సేనను ఎదుర్కోవడం సన్‌రైజర్స్‌కు కఠిన సవాల్‌గా మారింది. ముఖ్యంగా రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయడంపైనే ఎస్‌ఆర్‌హెచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడుసార్లు నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారు. ఈ బలహీనతలే జట్టును ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జోష్ హాజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్ల బౌలింగ్‌లోనే ఏమాత్రం బెరుకు లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సన్‌రైజర్స్ బౌలర్లు సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటివరకు సన్‌రైజర్స్ జట్టు సూర్యవంశీని ఎదుర్కోనప్పటికీ, అతని ప్రమాదకర బ్యాటింగ్ గురించి వారికి బాగా తెలుసు. అతడిని ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపకపోతే, సన్‌రైజర్స్ బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.

Vaibhav Suryavanshi
Sunrisers Hyderabad
Rajasthan Royals
IPL 2026
SRH vs RR
Hyderabad
Riyan Parag
IPL
Cricket
T20

More Telugu News